![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 563 లో.....సాగర్, నర్మద ధీరజ్, ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరిని కలపమని నర్మద అడిగితే సాగర్ నేను చేయనని తెగేసి చెప్తాడు. నర్మద షాక్ అయి మీ తమ్ముడంటే ప్రేమ లేదా అని అడుగుతుంది. సాగర్ భార్యాభర్తల గొడవలు సముద్రపు అలల లాంటివి, ఆపబోతే మనమే మునిగిపోతామని అంటాడు. పైగా మా నాన్న.. ది గ్రేట్ రామరాజు .. ఎక్కడో తుఫాను వచ్చినా నా వల్లే అని తిడతాడు. ఇప్పుడు వాళ్లని కలిపి ఏదైనా తేడా వస్తే నన్నే విలన్ చేస్తాడని, ఆ తలనొప్పి వద్దంటాడు సాగర్. మా తమ్ముడు అమాయకుడు కాదు.. వాడికే తెలుసు భార్యను ఎలా తెచ్చుకోవాలో అని చెప్పి నర్మదను లైన్ లోకి దించడానికి హ్యాండ్ రెజ్లింగ్ గేమ్ అంటూ చేయి పట్టుకుని లాగి రొమాంటిక్ సాంగ్ వేస్తాడు. మరోవైపు ప్రేమ రూమ్ లో ధీరజ్ గురించే ఆలోచిస్తుంటుంది. నిజంగానే నువ్వు నాకు వద్దు అన్న ధీరజ్ మాటను తలుచుకుని తెగ ఏడుస్తుంది. వాడు ఆ ముద్దపప్పు ముగ్ధ మాయలో పడ్డాడా లేక నన్ను కవ్వించడానికి డ్రామా ఆడుతున్నాడా అని తెలుసుకోలేక గూగుల్ ని అడుగుతుంది. మొగుడు నాతో మాట్లాడట్లేదు ఇది నిజమా డ్రామానా అంటే అటునుంచి నువ్వు తగ్గితే లోకువైపోతావు.. మొగుళ్లు చెలరేగిపోతారు.. కుక్కపిల్లలా గొంతుకు తాడు కట్టి ఆడిస్తారు.. మొగుడి మనసు బ్రహ్మ కూడా కనిపెట్టలేడని వాయిస్ వస్తుంది. దీంతో ప్రేమ మరింత కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు బాల్కనీలో విశ్వ అమూల్య కోసం ఎదురుచూస్తూ.. తన గీతోపదేశంతో ప్రేమ, ధీరజ్ కలిసారని ఫీలవుతూ కాల్ చేస్తాడు. అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి సైలెంట్ గా ఉంటే.. థాంక్స్ చెప్పడానికి మాటలు రావట్లేదా అని బిల్డప్ ఇస్తాడు. దానికి అమూల్య.. ఓరేయ్ బండోడా, వాళ్లు కలవలేదు, మళ్ళీ కొట్టుకుని పెద్ద గొడవైందని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది.
అర్ధరాత్రి గబ్బిలాల్లా గేటు పట్టుకుని వేలాడే దెయ్యాలు అని ధోరజ్ వెటకారంగా అంటాడు. మన్మధ రాజా ముద్దపప్పుతో షికార్లు చేసి ఎప్పుడు వస్తాడో చూద్దామని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ కావాలనే ముగ్ధ ఫోన్ చేసినట్లు యాక్టింగ్ చేస్తూ.. చెప్పు ముగ్ధ ఇప్పుడే కదా కాల్ చేశాను, ఇంతలోనే గుర్తొచ్చానా అంటూ ముద్దులు పెడుతూ మెలికలు తిరుగుతాడు. దాంతో మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అని ప్రేమ సాంగ్ పెడితుంది. నమ్మకు నమ్మకు ఆడాళ్ల ప్రేమను అని కౌంటర్ సాంగ్ పెడతాడు ధీరజ్. ఇద్దరూ వాదించుకుంటుండగా బయట పడుకున్న తిరుపతి దుప్పటి కప్పుకుని లేచి రావడంతో దెయ్యం అనుకుని ప్రేమ భయంతో ధీరజ్ ను హగ్ చేసుకుంటుంది. తిరుపతి.. హలో లవ్ బర్డ్స్, చాలాసేపు అయింది హగ్ చేసుకుని అనడంతో సిగ్గుతో వదిలేస్తుంది. నేను నిన్ను వదిలేస్తున్నా అని ఇద్దరూ అరుచుకుని వెళ్లిపోతారు.
లాస్ట్ లో చందు రూమ్ లో ఆరు లక్షల టెన్షన్ తో నిద్రపోకుండా ఉంటాడు. రేపు ధాన్యం బస్తాలు వస్తాయి.. డబ్బులు కట్టాలి అని రామరాజు అన్న మాట గుర్తుకు వచ్చి ఆ డబ్బు ఎలా పోయింది.. నాన్నకు ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. వల్లి ఇదే మంచి టైమ్ అని మళ్ళీ తిరుపతి మీదకు నెట్టాలని ప్లాన్ వేస్తుంది. రోజూ పడుకోగానే నిద్రపోతావ్ కదా.. ఆరు లక్షల గురించేనా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |